బీజేపీకి చెందిన ప్రముఖులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ సమావేశాన్ని కీలకమైన సమావేశంగా పరిగణించవచ్చు. అధికార పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ప్రచారంలో ఉంది. ఆయన పేరు కన్ఫర్మ్ అయినట్లు మార్కెట్‌లో ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈరోజు జరగనుంది, అందుకే వెంకయ్య నాయుడుతో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సింగ్, జెపి నడ్డాల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్, బిజూ జనతాదళ్ (బిజెడి) చీఫ్ నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సహా సీనియర్ నేతలు మాట్లాడారు.
బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) రాష్ట్రపతి ఎన్నికల్లో సంఖ్యా ప్రాతిపదికన బలమైన స్థితిలో ఉంది. దీనికి తోడు ఒడిశాలోని బిజూ జనతాదళ్ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతు లభిస్తే దాని విజయం ఖాయం.