హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడంతో కాంగ్రెస్‌పై భారతీయ జనతా పార్టీ సెటైర్లు కూడా వేస్తోంది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న బికనెర్వాలా స్టోర్ నుండి 1 కిలోగ్రాము జిలేబీని బీజేపీ ఆర్డర్ ఇచ్చింది. పన్నులతో సహా దాదాపు రూ. 609 ధర ఉంది. అయితే అది పంపించింది ఎవరికో కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి. జిలేబీ పార్సల్ పెట్టిన చిరునామా '24, అక్బర్ రోడ్' అని ఉండడంతో అది దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమని తెలుస్తోంది. ఈ జిలేబీ ఆర్డర్‌లో చివరి ట్విస్ట్ ఏమిటంటే ఈ ఆర్డర్ 'క్యాష్ ఆన్ డెలివరీ' అట.
అక్టోబరు 8 కౌంటింగ్ రోజున, పోల్ ఫలితాలు రావడం మొదలైనప్పటి నుండి జిలేబీ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హర్యానాలోని గుహనాలోని స్థానిక దుకాణం నుండి జిలేబీని రుచి చూసిన రాహుల్ గాంధీ దానిని పోల్ టాపిక్‌గా మార్చారు. జిలేబీలను ఫ్యాక్టరీలో, పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని అప్పుడే ప్రపంచం నలుమూలలకు చేరుతుందని ఆయన సూచించారు. అందుకే ఫలితాల తర్వాత ఆయనను ట్రోల్ చేయడానికి బీజేపీ రాహుల్ కు జిలేబీని పంపించింది.