కంగనా వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ దూరం

రైతుల నిరసన గురించి ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉంది

By Medi Samrat
Published on : 26 Aug 2024 9:15 PM IST

కంగనా వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ దూరం

రైతుల నిరసన గురించి ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉంది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయకూడదని కంగనాను బీజేపీ అధిష్టానం కోరింది. "రైతుల నిరసనల గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ప్రకటన పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదు. ఆమె వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ తన అసమ్మతిని తెలియజేస్తోంది" అని బీజేపీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

మండి ఎంపీ కంగనా రనౌత్‌ రైతుల ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్‌ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందన్నారు కంగనా.. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్‌ వేదికగా కంగనా ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారని కంగనా ఆరోపించారు.

Next Story