ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై సీనియర్ నేత, మాజీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను బీజేపీ బరిలోకి దించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ. 2014 నుంచి 2024 వరకు పర్వేష్ సాహిబ్ సింగ్ ఎంపీగా పని చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ తరుఫున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగుతున్నారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ప్రత్యర్థులుగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలోకి దిగనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పోటీ చేయనున్న కల్కాజీ స్థానం నుండి మాజీ ఎంపీ రమేష్ బిధూరిని బీజేపీ పోటీకి ఉంచింది. కల్కాజీ స్థానానికి కాంగ్రెస్ నుండి సీనియర్ లీడర్ అల్కా లంబా బరిలోకి దింపారు. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాలవీయ నగర్ టికెట్ దక్కించుకున్నారు.