ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది. రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. కాగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. అలాగే డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మకు అవకాశం కల్పించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రాం లీలా మైదానంలో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. 8వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ 48 సీట్లు గెలుచుకుని 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది.