సింగర్‌ను పెళ్లాడిన బీజేపీ ఎంపీ

బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తమిళనాడు సింగర్ శివశ్రీ స్కందప్రసాద్‌ని పెళ్లాడారు.

By Medi Samrat
Published on : 6 March 2025 3:49 PM IST

సింగర్‌ను పెళ్లాడిన బీజేపీ ఎంపీ

బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తమిళనాడు సింగర్ శివశ్రీ స్కందప్రసాద్‌ని పెళ్లాడారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ప్ర‌స్తుతంపెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పలువురు నేతలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ నేతలు అన్నామలై, ప్రతాప్‌సింహ, అమిత్‌ మాలవీయ తదితరులు పెళ్లి ఫొటోల్లో కనిపిస్తున్నారు. కర్నాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కేంద్ర మంత్రి వీ సోమన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పెళ్లికి శివశ్రీ స్కందప్రసాద్ ప్రకాశవంతమైన పసుపు రంగు కాంజీవరం పట్టు చీరను ధరించారు. సూర్య బంగారు, తెలుపు సంప్రదాయ దుస్తులలో కనిపించాడు.

శివశ్రీ స్కందప్రసాద్ ఎవరు?

శివశ్రీ స్కందప్రసాద్ చెన్నైలో ఉంటున్న ప్రముఖ కర్ణాటక గాయని, భరతనాట్య కళాకారిణి. శివశ్రీ స్కందప్రసాద్ గురువు ఎ.ఎస్. మురళి ఆధ్వర్యంలో కర్నాటక సంగీతంలో శిక్షణ పొందారు. ఆమె బ్రహ్మ గానసభ, కార్తీక్ ఫైన్ ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై తన ప్రతిభను ప్రదర్శించారు. శివశ్రీ సంగీతం, నృత్యంతో పాటు ఫ్రీలాన్స్ మోడల్, పెయింటర్ కూడా. పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ 2 కు కన్నడ వెర్షన్‌లో ఐశ్వర్యరాయ్‌కు ఆమె తన గాత్రాన్ని అందించింది. శివశ్రీ బయో ఇంజనీరింగ్‌లో డిగ్రీ, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది.

Next Story