తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామిపై ఎంపి సుమలత సోమవారం విరుచుకుపడ్డారు. తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ సుమలత మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. "ఈ ప్రకటన అతని మనస్తత్వం యొక్క ప్రతిబింబం, మాండ్యలో జరిగిన నష్టాల గాయాలు నయం కాలేదు. కుమారస్వామి అవినీతిపరులకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో ఖచ్చితంగా తెలియదు" అని ఆమె తెలిపారు. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తనను కించపరచేలా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలు ఆయన ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయని సుమలత మండిపడ్డారు.
కృష్ణ సాగర్ డ్యామ్ బీటలు వారి లీకేజీ అవుతోందని, ఇసుక మాఫియా ఆరోపణలున్నాయని సుమలత గత వ్యాఖ్యలు చేయగా.. ఆమె వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. సుమలత అక్కడికి వెళ్లాలి. కృష్ణ రాజసాగర్ (కేఆర్ఎస్) డ్యామ్ పగుళ్లు, వృథా నీటిని అడ్డుకోవడానికి డ్యామ్ గేట్లు కింద తలపెట్టాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే సుమలత తీవ్రంగా మండిపడ్డారు. డ్యామ్ కు పగుళ్లు వచ్చినట్లు తనకు సమాచారం ఉందని, నిపుణులు విచారణ చేస్తేనే నిజం బయటపడుతుందని సుమతల అన్నారు. నిపుణుల తనిఖీకి స్థానిక రాజకీయనేతలు అనుమతించడం లేదని ఆరోపించారు. కేఆర్ఎస్ డ్యామ్ పగుళ్లపై వస్తున్న ఆరోపణలు, స్టోన్ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.