Video : సిద్ధరామయ్య సీఎంగా ఉంటారా.? లేదా.? చిలుక ఏం చెప్పింది.?

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా చర్చ జోరందుకుంది.

By -  Medi Samrat
Published on : 23 Nov 2025 3:07 PM IST

Video : సిద్ధరామయ్య సీఎంగా ఉంటారా.? లేదా.? చిలుక ఏం చెప్పింది.?

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా చర్చ జోరందుకుంది. సీఎం కుర్చీ కోసం టగ్ ఆఫ్ వార్ నడుమ బీజేపీ కార్యకర్తలు చేసిన సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌ను ఎగతాళి చేస్తూ.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారా అని ఒక చిలుకను అడగ్గా, చిలుక ఖాళీ చంబు కార్డును అందుకుంది. ఆ తర్వాత కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవుతారా అని చిలుక అడగ‌గా.. అది పువ్వులు ఉన్న కార్డును అందుకుంది.

కర్ణాటకలోని మాండ్యాలో రాష్ట్రంలో అధికార పంపిణీకి సంబంధించి బీజేపీ కార్యకర్తలు వ్యంగ్యాస్త్రం సంధించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో సాంప్రదాయ చిలుక భవిష్యవాణి సాంకేతికతను ఉపయోగించారు.


సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుందా లేక శివకుమార్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా అని కొందరు బీజేపీ కార్యకర్తలు చిలుకను అడిగా అంచనాలు వేస్తున్నారు ఓ వీడియోలో.

దీనికి చిలుక చంబు (నీటిని ఉంచడానికి ఉపయోగించే చిన్న లోహపు పాత్ర) గీసిన కార్డును అందుకుంది. ఇలా ఎగ‌తాళి చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఖాళీ గాజులు ఇచ్చి చెవిలో పూలు పెట్టింద‌ని.. ప్రజాధనాన్ని వృధా చేసిందని సెటైర్లు సంధించారు.

Next Story