కరోనాతో మహిళా ఎమ్మెల్యే క‌న్నుమూత‌

BJP MLA Kiran Maheshwari passes away. కరోనా వైరస్ ధాటికి మ‌రో ఎమ్మెల్యే బ‌ల‌య్యారు. ఇప్ప‌టికే ఎంతోమంది

By Medi Samrat  Published on  30 Nov 2020 5:05 AM GMT
కరోనాతో మహిళా ఎమ్మెల్యే క‌న్నుమూత‌

కరోనా వైరస్ ధాటికి మ‌రో ఎమ్మెల్యే బ‌ల‌య్యారు. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులను బ‌లి తీసుకున్న ఈ మ‌హమ్మారి.. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేను బ‌లితీసుకుంది. వివ‌రాళ్లోకెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌స‌మంద్ నియోజ‌క‌వ‌ర్గ‌‌ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు.

బీజేపీ ఎమ్మెల్యే అయిన కిరణ్ మహేశ్వరికి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో.. ఆమె గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి కన్నుమూశారు. కిరణ్ మహేశ్వరి భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సోమవారం ఆమె స్వస్థలమైన ఉదయ్ పూర్ కు తీసుకురానున్నారు.

కిరణ్ మహేశ్వరి గతంలో రాజస్థాన్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో ఈమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.


Next Story