గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే అర‌వింద్ గిరి క‌న్నుమూత‌

BJP MLA Arvind Giri dies of heart attack.ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి గుండెపోటుతో క‌న్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sept 2022 11:21 AM IST
గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే అర‌వింద్ గిరి క‌న్నుమూత‌

ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే అరవింద్ గిరి గుండెపోటుతో క‌న్నుమూశారు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. మంగళవారం ఉద‌యం ఆయ‌న లక్నోకు వెలుతుండ‌గా.. సిధౌలి(సీతాపూర్‌) వ‌ద్ద గుండెపోటు రాగా.. స‌మీపంలోని ఆస్ప‌త్రికి తీసుకువెలుతుండ‌గా మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న వ‌య‌స్సు 65 సంవ‌త్స‌రాలు.

ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి ప‌ట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. అరవింద్ గిరి మృతి దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. కుటుంబ స‌భ్యుల‌కు భ‌గ‌వంతుడు మ‌నోధైర్యం చేకూర్చాల‌ని ప్రార్థించారు.

లఖింపూర్ ఖేరీ జిల్లాలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అరవింద్ గిరి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993లో ఆయ‌న స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. 2006లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంత‌రం 2017 మ‌రియు 2022ల‌లో బీజేపీ అభ్య‌ర్థిగా గెలుపొందారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది లఖింపూర్ ఖేరీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

Next Story