మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ స్పా సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నేత, అటవీ శాఖ మంత్రి విజయ్ షాకు సన్నిహితులని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మంత్రితో కలిసి వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఆరోపణలపై అటవీ శాఖ మంత్రి విజయ్ షా మాట్లాడుతూ.. మేము ప్రజా జీవితంలో పనిచేసేటప్పుడు చాలా మంది మాతో ఫోటోలు దిగుతుంటారు. రాజకీయాలకు, వ్యక్తిగత జీవితాలకు తేడా ఉంటుంది. ఏదైనా తప్పు చేసి ఉంటే.. అప్పుడు పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని అన్నారు.
ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలోని స్పా సెంటర్‌ను క్రైమ్ బ్రాంచ్, మహిళా ఠాణా పోలీసులు రైడ్ చేశారు. అక్కడ వ్యబిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి విదేశీ అమ్మాయిలు, అబ్బాయిలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టుబడిన ముగ్గురు కుర్రాళ్లు ఖాండ్వాకు చెందిన వారని.. బీజేపీలో కీలక పదవులలో ఉన్నవారని తెలిసింది. ముగ్గురూ అటవీశాఖ మంత్రి, హర్సూద్ ఎమ్మెల్యే విజయ్ షాకు సన్నిహితులని చెబుతున్నారు. ఆ ముగ్గురి వల్ల పార్టీ ప్రతిష్టను దిగజారిందని.. ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సేవాదాస్ పటేల్ చర్యలు తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు సూచించారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన పార్టీ అధికారులందరిపైనా చర్యలు తీసుకుంటామని జిల్లా అధ్యక్షుడు చెబుతున్నారు.