ప్రధాని కాన్వాయ్‌కు భద్రత లోపంపై విరుచుకుప‌డ్డ బీజేపీ పాలిత‌ సీఎంలు

BJP leaders furious over lapse in PM Modi's security. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు భద్రత లోపంపై ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  5 Jan 2022 2:41 PM GMT
ప్రధాని కాన్వాయ్‌కు భద్రత లోపంపై విరుచుకుప‌డ్డ బీజేపీ పాలిత‌ సీఎంలు

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు భద్రత లోపంపై ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం గందరగోళంలో పడింది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌ నుంచి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వరకు ఈ విషయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఈ విషయంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని అన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ విషయంపై కాంగ్రెస్ మీద‌ మండిపడ్డారు.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. 'ప్రధానమంత్రి భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఇది ప్రధాని జీవితంతో ఆడుకోవడం కాదు, దేశ భద్రతతో ఆడుకోవడం. కాంగ్రెస్, కాంగ్రెస్ ప్రభుత్వం, గాంధీ కుటుంబం ప్రధానమంత్రి భద్రతతో ఆడుకునేంత ద్వేషం! ఇది నేరపూరిత కుట్ర అని వ్యాఖ్యానించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. పంజాబ్ అభివృద్ధికి సంబంధించిన పథకాలను ప్రారంభించేందుకు వెళ్తున్న ప్రధాని మోదీ కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడం సిగ్గుచేటు. ఇది తీవ్రమైన భద్రతా లోపం. ''కాంగ్రెస్‌కు అభివృద్ధిపై అంతగా ఆసక్తి లేదని.. కేవలం రాజకీయాలు చేయాలనే తపన ఉందని ఈరోజు జరిగిన ఘటన తెలియజేస్తోందని.. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు.


Next Story