బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అనారోగ్యంతో బుధవారం అర్థరాత్రి ఎయిమ్స్‌లో చేరారు. మాజీ ఉప ప్రధాని అద్వానీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 96 ఏళ్ల అద్వానీని యూరాలజీ విభాగం వైద్యుల పర్యవేక్షణలో ప్రైవేట్ వార్డులో ఉంచినట్లు వర్గాలు తెలిపాయి.
అద్వానీ 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇటీవల అద్వానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్నారు. అద్వానీ 1998 నుండి 2004 వరకూ సుదీర్ఘకాలం హోం వ్యవహారాల మంత్రి పనిచేశారు. లోక్‌సభలో ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి కూడా గుర్తింపు పొందారు. అంతేకాదు 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లారు. అద్వానీ మూడు సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.