బీహార్‌లోని అర్రాలోని ఫ్రెండ్స్ కాలనీలో బీజేపీ నాయకుడు, కాంట్రాక్టర్ బబ్లూ సింగ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ నేత మార్నింగ్ వాక్ కు వెళుతుండగా కాల్పులు జరిపారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు."అతను మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో కాల్పులు జరిపారు. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసుల విచారణ జరుగుతోంది" అని ఎస్పీ హిమాన్షు తెలిపారు.
నగరంలోని నవాడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కాల్పులు జరిపారు. గాయపడిన కాంట్రాక్టర్‌ను చాలా సమీపం నుండి వెనుక వైపు నుండి కాల్చారు. కాల్పులు జరిగిన వెంటనే నేలపై పడిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం బాబు బజార్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముసుగులు ధరించిన ఇద్దరు అతడిని కాల్చారు.