అలా చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుంది : బీజేపీ

BJP in Karnataka challenges Congress to ban RSS and Bajrang Dal. ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌పై కాంగ్రెస్‌ నిషేధం విధించడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

By Medi Samrat  Published on  27 May 2023 11:15 AM IST
అలా చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుంది : బీజేపీ

ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌పై కాంగ్రెస్‌ నిషేధం విధించడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రకటనపై ఘాటుగా వ్యాఖ్యానించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. కాంగ్రెస్ ఇలాంటివి చేస్తే ఫలితం ఉండదని అన్నారు. కాంగ్రెస్ ప్రతీకార రాజకీయాలు చేస్తోందని బొమ్మై అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నించినప్పుడల్లా ప్రజలు ఇంటికి పంపారని అన్నారు.

కర్ణాటక కేబినెట్ మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేత‌ అశోక స్పందిస్తూ.. "మీ నాన్న ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించలేకపోయారు. మీ అమ్మమ్మ చేసింది కాదు. మీ ముత్తాత కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు మీరేం చేయగలరు?" పార్లమెంటులో కాంగ్రెస్‌కు ఒకప్పుడు మెజారిటీ ఉండేదని ఆయన అన్నారు. దేశంలో 15-20 రాష్ట్రాల‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేవి.. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది.. దమ్ముంటే ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించండి.. మీ ప్రభుత్వం మూడు నెలలు కొనసాగదు. లక్షల శాఖలలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు పనిచేస్తున్నారు. ఒక శాఖపై నిషేధం విధించండిఅంటూ అశోక సవాలు విసిరారు. హిందూ భావాలు ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్‌తో ఉన్నాయని అన్నారు.

కర్ణాటకలో బజరంగ్‌దళ్‌పై నిషేధం విధించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రియాంక్ ఖర్గే గురువారం చెప్పారు. రాష్ట్రంలో శాంతి కోసం హింసకు పాల్పడే ఆర్‌ఎస్‌ఎస్ లేదా భజరంగ్ దళ్ లేదా మరే ఇతర మతతత్వ సంస్థనైనా నిషేధించడానికి మేము వెనుకాడబోమని ఆయ‌న అన్నారు.

Next Story