రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ‌కు ఎవ‌రంటే..

BJP chief Nadda announces new team of State in-charges. కేంద్రంలో రెండ‌వసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. పాల‌న‌లో

By Medi Samrat  Published on  14 Nov 2020 8:55 AM IST
రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ అధిష్టానం.. తెలంగాణ‌కు ఎవ‌రంటే..

కేంద్రంలో రెండ‌వసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. పాల‌న‌లో త‌న మార్క్ చూపిస్తుంది. అయితే పార్టీ బ‌ల‌పేతంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తోంది. మొన్న‌టికిమొన్న రాష్ట్రాల‌కు అధ్య‌క్షుల‌ను నియ‌మించిన అధిష్టానం.. ఆ త‌ర్వాత జాతీయ కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించింది. తాజాగా.. వివిధ రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను, స‌హ ఇంచార్జ్‌ల‌ను నియమించింది బీజేపీ అధిష్టానం.

కొత్త‌గా ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జిగా మురళీధరన్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ ఇంచార్జ్‌గా ఉన్న సునీల్ దేవధర్‌కు షాక్ ఇస్తూ సహ-ఇంచార్జ్ నియ‌మించింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా తరుణ్ చుగ్‌ను నియ‌మించింది.

ఇక‌ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అండమాన్-నికోబార్ ఇంచార్జ్‌గా, ఉత్తర్‌‌ ప్రదేశ్ సహా ఇంచార్జిగా బాధ్యతలు అప్ప‌గించింది. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి ద‌గ్గుపాటి పురందేశ్వరికి చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల బాధ్యతలు అప్ప‌గించారు.

అలాగే.. మురళీధర్ రావుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్‌ బాధ్యతలు, పొంగులేటి సుధాకర్ రెడ్డికి తమిళనాడు సహ-ఇంచార్జ్‌ బాధ్యతలు, డీకే అరుణకు కర్నాటక సహా ఇంచార్జిగా బాధ్యతలు అప్ప‌గిస్తూ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది.


Next Story