ఢిల్లీ: ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్‌పై పది రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని డెసిషన్ తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంచార్జ్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జీవి ఎల్ నర్సింహరావును నియమించారు. కమిటీలలో మేధావులు, ఆర్థిక నిపుణులను నియమించనున్నారు.
బడ్జెట్ అవగాహన, ఆర్థిక అవగాహన, క్షేత్రస్థాయిలో ప్రజల వివరించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలు, ఆత్మనిర్బర్ పై అవగాహన , 2047 లక్ష్యంగా వికసిత్ భారత్ పై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నియోజక వర్గాల వారిగా ప్రజల వివరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర నేతలు ,క్షేత్రస్థాయి నాయకులు పాలుపంచుకుంటారు.