బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్‌లో ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. మరోవైపు బీహార్, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పార్టీ నాయకుడు బైజయంత్ పాండాను బీజేపీ నియమించింది. ఎన్నికల కో-ఇన్‌చార్జిగా మురళీధర్ మోహోల్ నియమితులయ్యారు.
దీంతో పాటు పార్టీ కీలక నేత ధర్మేంద్ర ప్రధాన్‌ను బీహార్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ నియమించింది. ఆ పార్టీకి చెందిన సీఆర్ పాటిల్, కేశవ్ ప్రసాద్ మౌర్యలను కో-ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ పశ్చిమ బెంగాల్‌కు పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. బిప్లబ్ కుమార్ దేబ్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు.