అక్కడ.. ఆ పార్టీతో చేతులు కలిపేస్తున్న బీజేపీ.?

రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) మధ్య మళ్లీ పొత్తు గురించి చర్చలు వచ్చాయి.

By Medi Samrat  Published on  19 March 2024 8:14 PM IST
అక్కడ.. ఆ పార్టీతో చేతులు కలిపేస్తున్న బీజేపీ.?

రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) మధ్య మళ్లీ పొత్తు గురించి చర్చలు వచ్చాయి. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. పంజాబ్‌లో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి ఎస్ఎస్ చన్నీ మీడియాకు తెలిపారు.

శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) కోర్ కమిటీ సమావేశం చండీగఢ్‌లో జరగనుంది. అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా కూడా ఈ సమావేశంలో ఎన్నికల పొత్తుతో సహా పలు అంశాలపై చర్చిస్తామని ధృవీకరించారు. కోర్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగినా, అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తామని.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు దేశం, పంజాబ్ పరిస్థితి కూడా చర్చకు వస్తుందని అన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు గాను ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. బీజేపీ, ఎస్‌ఏడీ చెరో రెండు సీట్లు సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒక్క సీటుతో రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2020లో, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో సంబంధాలను తెంచుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుండి వైదొలిగింది.

Next Story