బర్డ్‌ ఫ్లూ కలకలం.. 25 వేల కోళ్లను చంపాలని ఆదేశం

Bird flu scare in Maharashtra's Thane. మహారాష్ట్రలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. థానేలోని ఒక చిన్న ఫారమ్‌లో పౌల్ట్రీ పక్షులు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ బారిన

By అంజి  Published on  18 Feb 2022 2:41 PM IST
బర్డ్‌ ఫ్లూ కలకలం.. 25 వేల కోళ్లను చంపాలని ఆదేశం

మహారాష్ట్రలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. థానేలోని ఒక చిన్న ఫారమ్‌లో పౌల్ట్రీ పక్షులు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ బారిన పడ్డాయని గురువారం సాయంత్రం జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. వందల కోళ్లు మృతి చెందాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పరిపాలన హై అలర్ట్‌గా ఉందని మహారాష్ట్ర పశుసంవర్ధక కమిషనర్ సచింద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకిందని అనుమానం రావడంతో.. వెంటనే కోళ్ల నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఫామ్‌లోని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించారు. ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థ ప్రకారం.. బీహార్‌లోని పౌల్ట్రీ రీసెర్చ్ ఫామ్‌లో అంటువ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ వ్యాప్తి చెందిందని ఇంతకు ముందు నివేదించింది.

వెహ్లోలీకి కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న సుమారు 25 వేల కోళ్లను చంపేయాలని అధికారులకు సూచించారు. వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయాని థానే జెడ్పీ సీఈఓ డా. బహుసాహెబ్‌ దంగ్డే వెల్లడించారు. బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర పశు సంవర్ధక శాఖకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించి పరీక్ష కోసం పూణే ఆధారిత ప్రయోగశాలకు పంపామని తెలిపారు.

బర్డ్ ఫ్లూ భయం నేపథ్యంలో థానేలోని ప్రభావిత పౌల్ట్రీ ఫారమ్‌కి కిలోమీటరు వ్యాసార్థంలో ఉన్న సుమారు 25,000 కోళ్లను చంపేయాలని అధికారులు చెప్పారు. థానే జిల్లాలోని షాహాపూర్ తహసీల్‌లోని వెహ్లోలి గ్రామంలోని ఫారంలో సుమారు 100 కోళ్లు ఆకస్మికంగా మృతి చెందిన కొద్ది రోజుల తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. థానే జిల్లా కలెక్టర్ రాజేష్ జె నార్వేకర్ మాట్లాడుతూ.. వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖను ఆదేశించామని, చనిపోయిన పక్షుల నమూనాలను పరీక్ష కోసం పూణే ఆధారిత ప్రయోగశాలకు పంపామని తెలిపారు.

Next Story