అమానుషం : వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన బైకర్

Biker drags elderly man on Magadi road in Bengaluru. కర్ణాటకలోని బెంగళూరులోని మగడి రోడ్డులో ఓ వ్యక్తి వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.

By Medi Samrat
Published on : 17 Jan 2023 9:25 PM IST

అమానుషం : వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన బైకర్

కర్ణాటకలోని బెంగళూరులోని మగడి రోడ్డులో ఓ వ్యక్తి వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వీడియోలో బైకర్ వేగంగా వెళుతుండ‌గా.. వృద్ధుడు వాహనాన్ని పట్టుకుని వేళాడుతూ కనిపించాడు. బైకర్ కారును ఢీకొట్టాడు అని కారు డ్రైవర్‌ ప్రశ్నిస్తుండగా.. అత‌నిని రోడ్డుపై ఈడ్చుకెళ్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ద్విచక్రవాహనదారుడిని మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఆటో రిక్షా డ్రైవ‌ర్ అడ్డుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో బైక్‌కు వేళాడుతున్న‌ ముత్తప్ప (55) అనే వృద్ధుడు గాయాలతో బయటపడ్డాడు.

బైకర్‌ను మెడికల్ సేల్స్‌మెన్ సాహిల్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గోవిందరాజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదైంది. గాయ‌ప‌డిన ముత్తప్పను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవ‌ల ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న 20 ఏళ్ల అమ్మాయి అంజలిని కారు ఢీకొట్టి 12కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే తాజా ఘ‌ట‌న చోటుచేసుకుంది.




Next Story