ఆదివారం నాడు ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వరకు దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర ఓ వ్యక్తిని కారు బానెట్ పైనే ఉంచి తీసుకునివెళ్లాడు. కారు బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ చందన్‌సింగ్‌కు చెందినదని.. అతని డ్రైవర్ ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు కారులో ఎంపీ లేరని తెలిపారు.
బాధితుడి పేరు చేతన్. అతడు క్యాబ్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. ఒక ప్యాసింజర్‌ను దింపి వస్తుండగా చేతన్ క్యాబ్‌ను ఎంపీ కారు డ్రైవర్ మూడుసార్లు ఢీకొట్టాడు. దీంతో అతడు కారు దిగి ఎంపీ కారుకు అడ్డంగా నిలబడ్డాడు. ఆ కారు డ్రైవర్ వేగాన్ని పెంచి చేతన్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడు బానెట్‌పై పడిపోయాడు. కారు ఆపాలని చేతన్ అరుస్తున్నా ఎంపీ కారు డ్రైవర్ పట్టించుకోలేదు. పోలీసులు గమనించి కారును ఓవర్ టేక్ చేసి ఆపడంతో అతడు బయటపడ్డాడు. ఎంపీ కారు డ్రైవర్ పూర్తిగా తాగున్నాడని చేతన్ చెప్పుకొచ్చాడు. నిందితుడు ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. క్యాబ్ డ్రైవర్ కావాలని బానెట్ పైకి దూకాడని అంటున్నాడు.