బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువ‌డుతున్నాయి

By -  Medi Samrat
Published on : 11 Nov 2025 7:48 PM IST

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువ‌డుతున్నాయి. ఈసారి పోటీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. మహాకూటమి, ఎన్డీయేతో పాటు పీకేకి చెందిన జన్ సూరజ్ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ కూడా పోటీలో ఉన్నాయి.

పోల్‌స్ట్రాట్ సంస్థ‌ పార్టీల వారీగా సీట్ల సంఖ్యను కూడా విడుదల చేసింది. బీజేపీకి 68-72 సీట్లు, జేడీయూకు 55-60 సీట్లు, ఎల్‌జేపీ (ఆర్‌)కి 9-12 సీట్లు, హెచ్‌ఏఎంకు 1-2, ఆర్‌ఎల్‌ఎంకు 0-2 సీట్లు రావచ్చ‌ని అంచ‌నా వేసింది.

ఎగ్జిట్ పోల్‌లో ఎన్డీయేకు 133-148 సీట్లు వస్తాయని పోల్‌స్ట్రాట్ అంచనా వేసింది. మహా కూటమికి 100-108 సీట్లు రావచ్చు. ఇతరులకు 3-5 సీట్లు కోల్పోవచ్చని పేర్కొంది.

చాణక్య స్ట్రాటేజీస్‌.. NDAకి 130-138 సీట్లు, మహాకూటమికి 100-108 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది.

పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. ఎన్డీయేకు 133-159 సీట్లు వస్తాయని అంచనా. మహాకూటమికి 75-101 సీట్లు వస్తాయని అంచనా. ఇతరులు 2-13 సీట్లు గెలుస్తార‌ని వెల్ల‌డించింది.

పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. ఎన్డీయేకు 133-148 సీట్లు వస్తాయని అంచనా. మహాకూటమికి 87-102 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జన్ సూరజ్ కు 0-2 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

జేవీసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఎన్డీయేకు బంపర్ మెజారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఎన్డీయేకు 135-150 సీట్లు వస్తాయని, మహాకూటమికి 88-103 సీట్లు వస్తాయని అంచనా. ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

MATRIZE- IANS ఎగ్జిట్ పోల్‌లో ఎన్‌డిఎకు 48 శాతం, మహాకూటమికి 37 శాతం ఓట్లు, ఇతరులకు 15 శాతం ఓట్లు వస్తున్నాయి. ఎన్డీయేకు విపరీతమైన మెజారిటీ కనిపిస్తోంది. ఎన్డీయేకు 147-167 సీట్లు, మహాకూటమికి 70-90 సీట్లు వస్తాయని అంచనా.

ఇదిలావుంటే.. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీయేకు మొత్తం 125 సీట్లు రాగా, మహాకూటమికి 110 సీట్లు వచ్చాయి. ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Next Story