పాట్నాలోని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో 30 మందికి పైగా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. సర్క్యులర్ రోడ్డులోని ముఖ్యమంత్రి ఇల్లు కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా మారింది. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన వారిలో సీఎం భద్రతా సిబ్బంది, బంగ్లాలోని సిబ్బంది ఉన్నారు. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అవదేశ్ నారాయణ్ సింగ్, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు తార్కిషోర్ ప్రసాద్ మరియు రేణు దేవి కూడా కోవిడ్-19 లక్షణాలతో కనిపించడంతో ఐసోలేషన్ లో ఉన్నారు.
కోవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 'జనతా దర్బార్' కార్యక్రమాన్ని (ప్రజలతో సంభాషించడం) బీహార్ ప్రభుత్వం రద్దు చేసినట్లు వార్తా సంస్థ ANI బుధవారం మధ్యాహ్నం తెలిపింది. ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్, విద్యాశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి, విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి, సంక్షేమ శాఖ మంత్రి సంతోష్ కుమార్‌లకు కూడా వైరస్ సోకినట్లు సమాచారం. నలంద మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో 227 మంది, ఎయిమ్స్‌లో 12 మంది, ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 10 మంది, పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఐదుగురు వైద్యులకు వైరస్ సోకినట్లు సమాచారం అందింది.