తప్పకుండా మంచి ఫలితం వస్తుంది : నితీష్ కుమార్

I.N.D.I.A కూటమి సమావేశం తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  1 Sept 2023 8:23 PM IST
తప్పకుండా మంచి ఫలితం వస్తుంది : నితీష్ కుమార్

I.N.D.I.A కూటమి సమావేశం తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నాయన్నారు. తప్పకుండా మంచి ఫలితం వస్తుందని అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న వారు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం దేశ చరిత్రను మార్చాలనుకుంటున్నారని.. అలా చేయడానికి వారిని అనుమతించబోమని సిఎం నితీష్ అన్నారు.

అంతే కాకుండా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ప్రస్తుతం చేయని పనులే చాలా ప్రశంసలు అందుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రాల‌లో మంచి పనులు చేస్తున్న వారి గురించి ఎవరూ మాట్లాడడం లేదని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని ఉద్ధరిస్తామని.. ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం నితీశ్ అన్నారు.

ఆగస్ట్ 31న అనధికారిక భేటీ తర్వాత.. కూటమి సభ్యులు ముంబైలో ఈరోజు అధికారిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ స‌మావేశంలో 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ఆర్జేడీ అధినేత లాల్ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ సహా పెద్దలంతా హాజరయ్యారు.

Next Story