బీహార్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ పోస్టులకు ట్రాన్స్‌జెండర్లను రిక్రూట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లో భాగంగా ట్రాన్స్‌జెండర్లు లేదా వెనుకబడిన తరగతులకు చెందిన ట్రాన్స్‌జెండర్లను చేర్చాలని పరిపాలన శాఖ ఒక తీర్మానాన్ని జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన హోం, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కీలక నిర్ణయం : ఆ పోస్టులకు ట్రాన్స్‌జెండర్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తాజా నిర్ణయంతో రాబోయే రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లలో 51 మంది ట్రాన్స్‌జెండర్లు నేరుగా పోలీసు సర్వీస్‌లో రిక్రూట్ చేయబడతారు. అందులో 41 పోస్టులు కానిస్టేబుల్ కాగా.. మిగిలిన 10 ఇన్‌స్పెక్టర్లు పోస్టులు. ప్రతి 500 అపాయింట్‌మెంట్‌లకు ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే.. అధికారులు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన ట్రాన్స్‌జెండర్లను కనుగొనలేకపోతే, వెనుకబడిన తరగతికి చెందిన అర్హులైన అభ్యర్థుల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తారు.