వ్యవసాయంపై కేంద్ర కేబినెట్ నిన్న చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్టు ప్రచారం జరిగింది. అయితే క్యాబినెట్‌లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ నాటికి సాయం పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు ఇస్తుండగా దీన్ని రూ.10 వేలకు పెంచాలనే డిమాండ్ ఉంది.
ఇదిలా ఉంటే.. నూతన సంవత్సరం వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట నష్టం చెల్లింపులకు ఉద్దేశించిన పీఎం ఫసల్ బీమా యోజన నిధిని రూ.69,515 కోట్లకు పెంచింది. 50 కిలోల డీఏపీ బాస్తాను రూ.1350కే సరఫరా చేయనుంది. ఇందుకోసం రూ.3,850 కోట్లు కేటాయించింది. దీంతో దాదాపు 4 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. 23 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.