వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట.. రూ.87,695 కోట్ల AGR​ బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం

అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది.

By -  Medi Samrat
Published on : 31 Dec 2025 4:35 PM IST

వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట.. రూ.87,695 కోట్ల AGR​ బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం

అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. మూలాల ప్రకారం.. కేంద్ర క్యాబినెట్ బుధవారం ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని ఆమోదించింది. దీని కింద కంపెనీ సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలు 87,695 కోట్ల రూపాయలకు ప్రీజ్ చేయ‌బ‌డ్డాయి. టెలికాం రంగంలో పోటీని కొనసాగించడంతోపాటు వోడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ఉన్న 49% వాటా విలువను కాపాడుకోవడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ ఆమోదించిన ఈ ప్యాకేజీ ప్రకారం.. Vodafone Idea ఈ ప్రీజ్ చేయ‌బ‌డిన‌ బకాయిలను వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. 2031-32 ఆర్థిక సంవత్సరం (FY32) నుండి 2040-41 ఆర్థిక సంవత్సరం (FY41) మధ్య ఈ బకాయిలు ₹87,695 కోట్లు చెల్లించాల్సి ఉందని వర్గాలు తెలిపాయి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ బకాయిల మొత్తాన్ని తిరిగి అంచనా వేస్తుంది. ఉపశమనం ఉన్నప్పటికీ నిర్దిష్ట చెల్లింపుల కోసం కంపెనీ ఇప్పటికే ఉన్న టైమ్‌లైన్‌లకు కట్టుబడి ఉండాలి. మూలాల ప్రకారం.. 2017-18 మరియు 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన AGR బకాయిల చెల్లింపు నిబంధనలలో ఎటువంటి మార్పు లేదు. ఈ మొత్తాన్ని 2025-26 నుండి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య ముందుగా నిర్ణయించిన వాయిదాలలో Vodafone Ideaకి చెల్లించాలి.

ప్రభుత్వం ప్రస్తుతం వోడాఫోన్ ఐడియాలో దాదాపు 49% వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కేబినెట్ ప్ర‌స్తుత‌ చర్యలు ప్రభుత్వ పెట్టుబడులను పొందడమే కాకుండా దేశ టెలికాం మార్కెట్ 'ద్వంద్వ వ్యవస్థ' (కేవలం రెండు కంపెనీల ఆధిపత్యం)గా మారకుండా చూసేందుకు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయని వర్గాలు చెబుతున్నాయి. రిలీఫ్ ప్యాకేజీ సంస్థ తన సేవలను విస్తరించడానికి అవసరమైన మూలధనాన్ని సేకరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు,. ముఖ్యంగా 5G రోల్ అవుట్, నెట్‌వర్క్ అప్‌గ్రేడేషన్ కోసం. వోడాఫోన్-ఐడియా ఆర్థిక సంక్షోభం, కస్టమర్ల సంఖ్య క్షీణించడంతో చాలా కాలంగా పోరాడుతున్న సమయంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది.

Next Story