పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అసన్‌సోల్ లోక్‌సభ అభ్యర్థిగా వెనక్కి తగ్గిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ కొద్ది రోజుల తర్వాత తన నిర్ణయంపై యు-టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. "ప్రజలకు, మా అమ్మకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను. మీ ఆశీర్వాదాలు, సహకారం కోరుకుంటున్నాను. జై మాతా ది" అని పవన్ సింగ్ ఎక్స్‌లో రాశారు.
వ్యక్తిగత కారణాల వల్ల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేనని మార్చి 3వ తేదీన పవన్ సింగ్ ప్రకటించారు. ఇంతలోనే ఆయన తన నిర్ణయం మార్చుకున్నారు. "బీజేపీ అగ్ర నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ నన్ను నమ్మి అసన్‌సోల్ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను అసన్‌సోల్ నుండి ఎన్నికల్లో పోటీ చేయలేను" అని ఆయన ట్వీట్ చేశారు.
38 ఏళ్ల గాయకుడు తన అనేక పాటల వీడియోలతో ఫేమస్ అయ్యాడు. అయితే కొన్ని వీడియోల కారణంగా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. బాలీవుడ్ లెజెండ్ శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తరపున అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయనను మళ్లీ అదే సీటు నుంచి బరిలోకి దింపారు.