మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చేస్తోంది

Bhatti Vikramarka Fires On Modi. ఉన్న ఉద్యోగాలు నిలబెట్టుకోలేక, కొత్త ఉద్యోగాల కల్పన జరగక యువత నిరాశలో ఉంది.

By Medi Samrat  Published on  19 Jun 2021 12:58 PM GMT
మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చేస్తోంది

ఉన్న ఉద్యోగాలు నిలబెట్టుకోలేక, కొత్త ఉద్యోగాల కల్పన జరగక యువత నిరాశలో ఉంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూలుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో నేడు దేశమంతా అతలాకుతలమై తల్లడిల్లుతోంది. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తూ.. లక్షలాది మరణాలకు కారణమైందని అన్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న సందర్భంలో.. ''దేశానికి ముప్పు దాపురించి ఉంది.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకం మూల్యం చెల్లించాల్సి వస్తుంది'' అని రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. రాహుల్ గాంధీ విజన్ ను, ఆయన మాటలను దేశ ప్రధాని మోదీ పట్టించుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని భట్టి చెప్పారు.

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు, కరోనా బాధితులకు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిందని చెప్పారు. అదే విధంగా ఎన్.ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాలు ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయని భట్టి ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చేలా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించందని అన్నారు.

కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు గత 70 ఏళ్లుగా ఎన్నో రకాల వ్యవస్థలను దేశ ప్రజల కోసం నిర్మాణం చేశాయి. ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు అవసరమైన అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రూపొందించాయి. అందులో భాగంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వం రంగ సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు.. సహా ఎన్నింటినో నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిందన్నారు.

ఇవాళ దేశం మీద ఏ మాత్రం అవగాహలేని పాలకులు, కేవలం ప్రచార్భాటం, మాటలతో బతికే ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను కూలుస్తున్నాడన్నారు. దేశ ప్రజలంతా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకువచ్చాడని చెప్పారు. ఉద్యోగాలు లేక యువత నిరాశతో ఉందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారా అనేక రకాల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు స్రుష్టించాయి.. కానీ మోదీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి ఉద్యోగాలు లేకుండా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానిక పెట్టడం ద్వారా దేశ నిర్మాణాన్ని మోదీ ఫణంగా పెట్టారని విమర్శించారు.


Next Story