సంచ‌ల‌న నిర్ణ‌యం.. అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్ర‌క‌టించిన కొత్త సీఎం

Bhagwant Mann Announces Anti-Corruption Helpline. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన‌ భగవంత్ మాన్ గురువారం అవినీతి నిరోధక

By Medi Samrat  Published on  17 March 2022 1:14 PM GMT
సంచ‌ల‌న నిర్ణ‌యం.. అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్ర‌క‌టించిన కొత్త సీఎం

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన‌ భగవంత్ మాన్ గురువారం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిన్న ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్.. తాను "ఒక రోజు వృధా చేయనని" వాగ్దానం చేస్తూ.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి రోజైన‌ మార్చి 23న హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నంబర్.. నా వ్యక్తిగత నంబర్‌గా ఉంటుందని.. ఎవరైనా లంచం అడిగితే ఆ నంబర్‌కు ఆడియో, వీడియో పంపండని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

"99 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీపరులు కాబట్టి నేను ఏ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం లేదు.. ఒక్క‌ శాతం మంది అవినీతిపరులు ఉన్నారు. వారి వ‌ల్ల‌ వ్యవస్థను కుళ్ళిపోయింది. ఈ అవినీతి వ్యవస్థను ఆప్ మాత్రమే శుభ్రం చేయగలదని" భగవంత్ మాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. లంచం డిమాండ్ చేయడం, ఇతర అక్రమాలకు పాల్పడే అవినీతి అధికారుల వీడియోలను అప్‌లోడ్ చేయడానికి ప్రత్యేకంగా ఓ నంబర్ ఉంటుంది. అటువంటి అధికారులను త‌గిన‌ శిక్ష ఉంటుంద‌ని అన్నారు.

పంజాబ్ లో అవినీతి నిర్మూలన అనేది ఆప్‌ ముఖ్య వాగ్దానాలలో ఒకటి. ఫిబ్రవరి 5న పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'ఆప్ ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగుల‌ అవినీతిని అంతమొందిస్తామని' హామీ ఇచ్చారు. గురువారం పోలీసు, అడ్మినిస్ట్రేష‌న్‌ అధికారులతో స‌మావేశ‌మైన భగవంత్ మాన్.. అవినీతి రహిత ప్రభుత్వం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అవినీతి అధికారులకు మా ప్రభుత్వంలో స్థానం లేదని, అలాంటి ఫిర్యాదులేమైనా నా దృష్టికి వస్తే అటువంటి అధికారులపై ఎలాంటి సానుభూతి ఆశించవద్దని ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమైన అధికారులను ఉద్దేశించి అన్నారు. ఇవ్వబడుతుంది.













Next Story