భగవద్గీత మనలో ఆలోచలను, ప్రశ్నించే తత్వాన్ని ప్రేరేపిస్తుందని, ఇది చర్చను ప్రోత్సహిస్తుందని, మనసును విశాలవంతంగా చేస్తుందని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. స్వామి చిద్బవానందజీ వివరించిన భగవద్గీత కిండిల్ వెర్షన్ పుస్తకాన్ని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల ప్రేరణ పొందినవారు ఎప్పుడు సహజమైన కారుణ్యభావంతో మెలుగుతారని, వారి వ్యక్తిత్వం ప్రజాస్వామ్యబద్దంగా ఉంటుందని అన్నారు. భగవద్గీత మనల్ని ఆలోచింపజేస్తుందని, అలాగే ఇది మనల్ని ప్రశ్నించేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు. వ్యక్తిత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు అని అన్నారు.
కరోనా నిరోధక వ్యాక్సిన్లను విదేశాలకు సరఫరా చేయడం గురించి మాట్లాడుతూ.. ఇటీవల ప్రపంచానికి మందులు అవసరమైనప్పుడు వాటిని భారతదేశం అందజేయగలిగిందని అన్నారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచ దేశాలకు వెళ్తుండటం మన దేశానికి గర్వకారణమని అన్నారు. మానవాళికి సాంత్వన చేకూర్చడంతో పాటు సహాయపడాలని మనం కోరుకుంటామన్నారు. దీనినే భగవద్గీత మనకు బోధించిందని వివరించారు.
స్వయం సమృద్ద భారత దేశాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రధానమైనది సంపదను, విలువలను సృష్టించడమని మోదీ అన్నారు. ఈ సంపద, విలువలు కేవలం భారతదేశం కోసం మాత్రమే కాదని, యావత్తు మానవాళి కోసమని వివరించారు. స్వయం సమృద్ధ భారత వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని నమ్మతున్నామని మోదీ అన్నారు.