కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసింది. బెంగళూరులోని విద్యారణ్యపురలో భారీ వర్షం కారణంగా పాత బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే అంశం. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరిశీలించారు. నగరంలోని కేఆర్ సర్కిల్‌లో అండర్‌పాస్‌లో నీటిలో మునిగి 23 ఏళ్ల మహిళ మృతి చెందడం పట్ల సీఎం సంతాపం తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో.. చాలా మంది వినియోగదారులు వర్షంతో పాటు వడగళ్ళ చిత్రాలను షేర్ చేస్తున్నారు. ట్విటర్‌లో వీడియోలు, ఫొటోలు వెల్లువెత్తాయి. కుండపోత వర్షం వీడియోను షేర్ చేస్తూ వినియోగదారులు ప్రీ-మాన్సూన్ అని పిలుస్తున్నారు.