రాహుల్ జీ.. నీటి సమస్య కారణంగా 'పెళ్లి' కావ‌ట్లేదు.. ప‌రిష్క‌రించండి..!

కర్ణాటకలోని బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్ర కలకలం రేపుతుంది. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ నగరంలో అనేక రిజర్వాయర్లు వేసవికి ముందే ఎండిపోయాయి.

By Medi Samrat  Published on  11 March 2024 10:21 AM GMT
రాహుల్ జీ.. నీటి సమస్య కారణంగా పెళ్లి కావ‌ట్లేదు.. ప‌రిష్క‌రించండి..!

కర్ణాటకలోని బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్ర కలకలం రేపుతుంది. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఈ నగరంలో అనేక రిజర్వాయర్లు వేసవికి ముందే ఎండిపోయాయి. దీనిపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసేందుకు సామాన్యులు అనేక రెట్ల అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఇంతలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక వ్యక్తి నీటి సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ట్యాగ్ చేశాడు. అంతేకాదు పోస్ట్ వెనుక ఉన్న వ్యక్తి చెప్పిన కారణంతో వైరల్ అవుతోంది.

ఎక్స్‌ పోస్ట్‌లో నరేంద్ర అనే వ్యక్తి ఇలా అన్నాడు "రాహుల్ గాంధీ జీ.. దయచేసి బెంగళూరులోని నీటి సంక్షోభాన్ని అధిక‌ ప్రాధాన్యతతో ముగించడానికి చర్యలు తీసుకోండి. బెంగళూరులోని ఐటి పరిశ్రమలో పనిచేస్తున్న నా స్నేహితుడు ఇటీవల తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కోసం చూస్తున్నాడు. కానీ బెంగుళూరులో నీటి సమస్య కారణంగా అతనిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని రాసుకొచ్చాడు.



బెంగళూరులో తీవ్రమైన నీటి కొరత నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం మాట్లాడుతూ.. గత మూడు-నాలుగు దశాబ్దాలలో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎదుర్కోలేదని అన్నారు. గతంలో కూడా కరువు ఏర్పడిందని.. అయితే ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ఎన్నడూ ప్రకటించలేదని ఆయన విలేకరులతో అన్నారు.

కావేరి నదీ జలాలను అన్నిచోట్ల‌కు సరఫరా చేస్తున్నాం. అయితే బెంగళూరులోని దాదాపు 13,900 బోర్‌వెల్‌లలో 6,900 బోర్‌వెల్‌లు పనిచేయడం లేదని ఆయన అన్నారు. నీటి సరఫరా చేయడానికి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Next Story