బెంగళూరులో ఆ షాపులన్నీ మూతబడుతున్నాయ్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా పేరున్న బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతోంది.
By Medi Samrat Published on 30 March 2024 7:45 PM ISTసిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా పేరున్న బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతోంది. తాగునీటి వినియోగంపై విస్తృతమైన ఆంక్షలు విధించారు అధికారులు. అధికారుల ఆంక్షలతో ప్రభావితమైన వారిలో నగరంలోని కార్ వాష్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది తమ కార్ వాష్ సెంటర్ లను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. నీటిని వృధా చేయడంపై ఇప్పటికే బెంగుళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (BWSSB) కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. వాహనాలను కడగడం వంటి కార్యకలాపాలకు త్రాగునీటిని ఉపయోగిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే నీటి దుర్వినియోగానికి సంబంధించిన 22 కేసులకు సంబంధించి జలమండలి మొత్తం రూ.1.10 లక్షల జరిమానా విధించింది. చాలామంది తమ వాహనాలను ఇంట్లోనే కడగడాన్ని ఎంచుకున్నారు. దీంతో కార్ వాష్ సెంటర్లు కూడా భారీగా ఆదాయాన్ని కోల్పోతూ ఉన్నాయి.
నీటి కొరత కారణంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలని ఐటీ కంపెనీలు భావిస్తూ ఉండడంతో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) నీటి సరఫరా విషయంలో నగరంలోని ఐటీ కంపెనీలకు భరోసా కల్పించింది. నీటి కొరత కారణంగా రోజువారీ జీవితాలు ప్రభావితమవుతున్నందున వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని బెంగుళూరు IT కంపెనీలను కోరుతున్నారు.