వారి గురించి సమాచారం ఇస్తే 20 లక్షలు ఇస్తాం

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు అనుమానితుల గురించి సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డును అందజేస్తామని

By Medi Samrat  Published on  29 March 2024 6:20 PM IST
వారి గురించి సమాచారం ఇస్తే 20 లక్షలు ఇస్తాం

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు అనుమానితుల గురించి సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డును అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రకటించింది. కేఫ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని అమర్చిన ఇద్దరు నిందితులు ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాకు NIA రివార్డు ప్రకటించింది. వీరిద్దరూ ఇప్పటికే 2020 ఉగ్రవాద కేసులో వాంటెడ్ గా ఉన్నారు.


కర్ణాటకలో 12, ​​తమిళనాడులో ఐదు, ఉత్తరప్రదేశ్‌లో ఒక ప్రాంతం సహా 18 చోట్ల ఎన్‌ఐఏ బృందం సోదాలు నిర్వహించిన తర్వాత.. మార్చి 28న ఈ కేసులో సహ కుట్రదారుల్లో ఒకరైన ముజమ్మిల్ షరీఫ్‌ను ఎన్.ఐ.ఏ. అరెస్టు చేసింది. ఈ బాంబ్ బ్లాస్ట్ లో పాల్గొన్న ఇతర నిందితులకు షరీఫ్ లాజిస్టికల్ సపోర్ట్ అందించాడని ఎన్‌ఐఏ పేర్కొంది.




Next Story