విమానాశ్రయంలో కొరియన్ మహిళపై వేధింపులు.. ప్రైవేట్ భాగాలను అనుచితంగా తాకి..

బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌లో దక్షిణ కొరియా మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ గ్రౌండ్ స్టాఫ్‌ని అరెస్ట్ చేశారు.

By -  Medi Samrat
Published on : 22 Jan 2026 1:40 PM IST

విమానాశ్రయంలో కొరియన్ మహిళపై వేధింపులు.. ప్రైవేట్ భాగాలను అనుచితంగా తాకి..

బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌లో దక్షిణ కొరియా మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ గ్రౌండ్ స్టాఫ్‌ని అరెస్ట్ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన 32 ఏళ్ల వ్యాపారవేత్త నిందితులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సోదాల పేరుతో నిందితులు తనను అనుచితంగా తాకి కౌగిలించుకున్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

గతేడాది నవంబర్‌లో తాను టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చానని, సోమవారం తన దేశానికి తిరిగి వెళ్తున్నానని బాధిత మహిళ తెలిపింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద CISF శోధన, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ తర్వాత ఒక వ్యక్తి న‌న్ను సంప్రదించాడు. ఎయిర్‌పోర్టు ఉద్యోగిగా పరిచయం చేసుకుని బోర్డింగ్ పాస్ చెక్ చేశాడు. ఆమె చెక్-ఇన్ బ్యాగేజీలో సమస్య ఉందని, మళ్లీ తనిఖీ చేయాల్సి ఉంటుందని నిందితుడు మహిళకు చెప్పాడు. ఆ తర్వాత నిందితుడు బాధితురాలిని త‌నిఖీ (మాన్యువల్ ఫ్రిస్కింగ్) చేయాల‌ని అడిగాడు. ఆ త‌ర్వాత నిందితుడు తనను పురుషుల వాష్‌రూమ్‌కు తీసుకెళ్లాడని, అక్కడ మాన్యువల్ సెర్చ్ పేరుతో తనను చాలాసార్లు అనుచితంగా తాకాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత నిందితుడు త‌న‌ ప్రైవేట్ భాగాలను కూడా తాకాడని ఆరోపించింది. దీనికి మహిళ అభ్యంతరం చెప్పడంతో ఆమెను కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడు. దీంతో సదరు మహిళ విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎయిరిండియా గ్రౌండ్ స్టాఫ్ మహ్మద్ అఫ్ఫాన్ అహ్మద్ (25)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడికి దర్యాప్తు చేసే అధికారం లేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనుమానం ఉంటే అతడు ఇమ్మిగ్రేషన్ లేదా CISF సిబ్బందికి తెలియజేయవచ్చు, కానీ అతడు తాను స్వ‌యంగా శోధించే లేదా దర్యాప్తు చేసే హక్కు లేదు. అలాగే, మహిళను మహిళా ఉద్యోగి మాత్రమే పరీక్షించాలి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, యువతి ఆరోపణలను ధృవీకరించి, నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Next Story