140 అడుగుల పై నుండి పడినా.. ప్రాణాలు దక్కాయి.!

Belagavi man falls into 140ft gorge, rescued in 12 hours. బెళగావిలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి ప్రదీప్‌ సాగర్‌ వీకెండ్ కావడంతో శనివారం స్నేహితులతో

By Medi Samrat
Published on : 4 Oct 2021 11:36 AM IST

140 అడుగుల పై నుండి పడినా.. ప్రాణాలు దక్కాయి.!

బెళగావిలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి ప్రదీప్‌ సాగర్‌ వీకెండ్ కావడంతో శనివారం స్నేహితులతో కలిసి గోకాక్‌ జలపాతాన్ని చూడడానికి వెళ్ళాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో సెల్ఫీ తీసుకుంటూ జలపాతం ఒడ్డున నిలుచున్నారు. అలా తీస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. పైనుంచి పడడంతో మూర్ఛపోయాడు. దాదాపు 140 అడుగుల లోతులోకి పడిన ప్రదీప్‌సాగర్‌ను వెతికేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నించారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ప్రదీప్‌సాగర్‌ నుంచి సమాధానం రాకపోవడంతో సహాయ సిబ్బంది వెనుదిరిగారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రదీప్‌సాగర్‌కు మెలకువ వచ్చింది.

హుటాహుటిన ఫోన్‌ తీసి తన కోసం గాలించిన స్థానిక సామాజిక కార్యకర్త అయూబ్‌ఖాన్‌ నెంబర్‌కే ఫోను చేయడంతో ఆయన వెంటనే ప్రదీప్‌సాగర్‌తో మాట్లాడాడు. నువ్వేమీ భయపడద్దు.. మేము వస్తున్నామని ధైర్యం చెప్పారు. అగ్నిమాపక సిబ్బందిని తీసుకెళ్లి లోయలో నుంచి సురక్షితంగా వెలికితీశారు. పైనుంచి పడడంతో ప్రదీప్‌సాగర్‌కు బాగా గాయాలైనట్లు తెలిపారు. ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

దాదాపు 12 గంటల తర్వాత రక్షించబడ్డాడు. కింద పడ్డాక స్పృహ లోకి వచ్చాక 'నేను ఇక్కడ ఇరుక్కున్నాను, మీరంతా ఎక్కడ ఉన్నారు?' అని ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అతని స్నేహితులకు ప్రదీప్‌ మెసేజీ కూడా చేశాడట. దీంతో ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో విజయవంతంగా బయటకు తీశారు. కలబురగి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన ప్రదీప్, గత రెండు సంవత్సరాలుగా బెళగవి బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతని ముఖంపై గాయాలు ఉన్నాయి. అతన్ని గోకక్ లోని ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది.




Next Story