వచ్చే వారంలో ఏవైనా బ్యాంకు పనులు ఉంటే.. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోండి

Banks to remain closed for 4 days next week. మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, వచ్చే వారంలో సెలవులను దృష్టిలో

By Medi Samrat  Published on  9 April 2022 8:30 PM IST
వచ్చే వారంలో ఏవైనా బ్యాంకు పనులు ఉంటే.. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోండి

మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, వచ్చే వారంలో సెలవులను దృష్టిలో ఉంచుకుని పూర్తి చేసుకోవడం చాలా మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగం, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు, భారతదేశంలోని ప్రాంతీయ బ్యాంకులు వచ్చే వారంలో కొన్ని తేదీలలో మూసివేయనున్నారు. ఈ కేటగిరీల కింద రుణదాతలకు RBI సెలవులు ప్రకటించింది - నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల ముగింపు వంటివి ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి బ్యాంకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. అయితే, భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడిన కొన్ని రోజులు ఉన్నాయి - రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2), క్రిస్మస్ రోజు (డిసెంబర్ 25) ఇలా మరికొన్ని ఉన్నాయి.

వచ్చే వారం బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి (ఏప్రిల్ 10 నుండి)

ఏప్రిల్ 10, 2022 - ఆదివారం

ఏప్రిల్ 14, 2022 (గురువారం) - డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి/మహావీర్ జయంతి/బైసాఖీ/వైశాఖి/తమిళ నూతన సంవత్సర దినోత్సవం/చీరాబా/బిజూ పండుగ/బోహాగ్ బిహు (మేఘాలయ మరియు హిమాచల్ ప్రదేశ్ మినహా భారతదేశం మొత్తం)

ఏప్రిల్ 15, 2022 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే/బెంగాలీ న్యూ ఇయర్ డే (నబాబర్ష)/హిమాచల్ డే/విషు/బోహాగ్ బిహు (రాజస్థాన్, జమ్మూ- శ్రీనగర్ మినహా భారతదేశం అంతటా)

ఏప్రిల్ 16, 2022 (శనివారం) - బోహాగ్ బిహు (అస్సాం)
























Next Story