ఖాతాదారులకు అలర్ట్‌.. మార్చిలో బ్యాంకులకు సెలవులు..

Bank Holidays In March. మార్చి నెలలో బ్యాంకుల్లో లావాదేవీలు జరపాలనుకునేవారికి అలర్డ్‌. మార్చిలో మొత్తం 8 రోజులు

By Medi Samrat  Published on  27 Feb 2021 7:22 AM GMT
ఖాతాదారులకు అలర్ట్‌.. మార్చిలో బ్యాంకులకు సెలవులు..

మార్చి నెలలో బ్యాంకుల్లో లావాదేవీలు జరపాలనుకునేవారికి అలర్డ్‌. మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో బ్యాంకులు మూసే ఉంటాయి. మార్చిలో 31 రోజులు ఉంటే అందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. వీటితో పాటు మహాశివత్రి, హోళీ పండగలు కూడా మార్చిలోనే వచ్చాయి. దీంతో మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవే.

మార్చిలో ఆదివారాలు ఎప్పుడు వచ్చాయో చూస్తే.. మార్చి 7, 14,21, 28 తేదీల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. ఇక మార్చి 13న రెండో శనివారం, మార్చి 27న నాలుగో శనివారం. ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు మూసే ఉంటాయి. వీటితో పాటు మార్చి 11న మహాశివరాత్రి, మార్చి 29న హోళీ సందర్బంగా బ్యాంకులకు సెలువే. నాలుగో శనివారం, ఆదివారం, హోళీ పండగ వరుసగా మూడు రోజులు వచ్చాయి.

ఇక ఈ ఎనిమిది రోజుల పాటు మరో రెండు రోజులు కూడా బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. తొమ్మిది బ్యాంకు ఎంప్లాయిస్‌ యూనియన్లు మార్చి 15 నుంచి సమ్మెను ప్రకటించాయి. రెండో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపట్టనున్నాయి. యూనియన్‌ ప్రకటించినట్లుగానే ఒక వేళ సమ్మెకు దిగితే మరో రెండు రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

బ్యాంకులు మార్చి 15,16 తేదీల్లో సమ్మెకు దిగితే మార్చి 14న ఆదివారం వచ్చింది. ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులు ఈ ముఖ్యమైన సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అప్రమత్తమై బ్యాంకుకు సంబంధించిన పనులను చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకోండి. అయితే బ్యాంకులకు ప్రతీనెల ఉంటాయో రిజర్వ్‌బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (RBI) తన అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు ఉంటాయి.


Next Story
Share it