వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్‌

Bank Holidays From March 13th. బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్చి 15 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు

By Medi Samrat  Published on  9 March 2021 3:18 PM IST
వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్‌

బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్చి 15 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మె నేపథ్యంలో మార్చి 13 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మార్చి 13 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మార్చి 13న రెండో శనివారం, మార్చి 14న ఆదివారం సెలవు. అలాగే మార్చి 15,16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు మూతపడనున్నాయి. మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.

పండగల సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండో శనివారాలు, నాలుగు ఆదివారాలతో కలిపి మొత్తం మార్చి నెలలో 11 రోజుల పాటు బ్యాంకు శాఖలు పని చేయవు. స్థానిక సెలవులతో కలిపి 11 రోజుల పాటు బ్యాంకులు పని చేయనందున ఖాతాదారు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. మార్చి 22న బీహార్‌ దివస్‌, మార్చి 30న హోలి పండగ సందర్బంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వరుస సెలవులతో బ్యాంకులు మూతపడుతున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది.


Next Story