ప్రస్తుతం ప్రతి ఒక్కరికి బ్యాంకులో పని ఉంటుంది. మీకు బ్యాంకుల్లో ఏదైన పని ఉంటే వెంటనే చేసేయండి.. ఎందుకంటే బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. అత్యవసరమైన పనులు ఉంటే ఈ సెలవులకు ముందే ముగించుకోవడం మంచిది. సాధారణంగా ప్రతి నెల రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి డిసెంబర్ 26న నాలుగో శనివారం వచ్చింది. అంతకు ముందు రోజు 25న శుక్రవారం క్రిస్మస్ వచ్చింది. దీంతో ఈ రోజు బ్యాంకులు పని చేయవు. ఇక 27న ఆదివారం కావడంతో.. వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు మూతపడనున్నాయి.
ఇక ఈ సంవత్సరంలో ఇంకా 9 రోజులే ఉండగా.. అందులో మూడు రోజులు బ్యాంకులకు సెలవులే. సాధారణంగా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుంటాయి. పండగ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. ముందుగానే డబ్బులు చేతిలో ఉంచుకుంటే మంచిది. ఇక 28న సోమవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పని చేయనున్నాయి. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ రిటర్నులను ఈ నెల 31లోపే దాఖలు చేయాల్సి ఉంటుంది.