పులిని చంపి.. బండరాళ్లు కట్టి
Bandhavgarh’s ‘most stunning’ tigress found dumped in well. పులిని కొందరు చంపి దాని శరీరానికి బండ రాళ్లు కట్టి బావిలో పడేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని
By Medi Samrat
పులిని కొందరు చంపి దాని శరీరానికి బండ రాళ్లు కట్టి బావిలో పడేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో వెలుగుచూసింది. బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్(బీటీఆర్)కు చెందిన టీ-32 పేరున్న 14 ఏండ్ల ఆడ పులిని గుర్తు తెలియని వ్యక్తులు గాయపరిచి చంపేశారు. అనంతరం పులి మృతదేహానికి రెండు బండ రాళ్లు కట్టి మన్పూర్ బఫర్ జోన్ పరిధిలోని తమ్నా బాసా గ్రామం సమీపంలోని బావిలో పడేశారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి కలేబరాన్ని బావి నుంచి పైకి తీశారు. పులి ముఖంపై పదునైన ఆయుధం వల్ల కలిగిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పులి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్లు బీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విన్సెంట్ రహీమ్ తెలిపారు. ఈ ఆడ పులి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈనిందని, పలు పులి పిల్లలకు జన్మనిచ్చిందని విన్సెంట్ తెలిపారు. గణాంకాల ప్రకారం బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో వందకుపైగా పెద్ద పులులు ఉన్నాయని వెల్లడించారు. పులి మరణంపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెప్పారు.
ఈ పులిని బాంధవ్‌గఢ్ "most beautiful tigress" అని పిలిచే వారు. ఇప్పుడు అది శవమై కనిపించడం పట్ల పలువురు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ పులిని పలువురు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించారు. 14 సంవత్సరాల వయస్సు గల ఈ పులి 'అమానాలాబలి బాఘిన్' గా ప్రసిద్ది చెందింది. అమనాలాబలి ప్రాంతంలో ఈ పులి తరచుగా కనిపించేది. పులిని చంపి పడేసిన బావి మన్పూర్ బఫర్ జోన్‌లో తమ్నా బాసా గ్రామానికి సమీపంలో ఉంది. నిందితులను పట్టుకోడానికి స్నిఫర్ డాగ్స్ ను ఉపయోగించారు. ట్రాక్ చేయాలని ప్రయత్నించగా.. కానీ భారీ వర్షం కారణంగా వారు కాలిగుర్తులను కోల్పోయారు. T32 పులి 2011, 2013 మరియు 2015 లో మూడు సార్లు తొమ్మిది పిల్లలను ప్రసవించింది. పర్యావరణవేత్త అజయ్ దుబే దాని మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.