మదర్సాలను నిషేధించాలి : బీజేపీ ఎమ్మెల్యే

Ban madrasas as they teach anti-national lessons. కర్ణాటక బిజెపి శాసనసభ్యుడు రేణుకాచార్య శ‌నివారం చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదమయ్యాయి.

By Medi Samrat  Published on  26 March 2022 9:15 PM IST
మదర్సాలను నిషేధించాలి : బీజేపీ ఎమ్మెల్యే

కర్ణాటక బిజెపి శాసనసభ్యుడు రేణుకాచార్య శ‌నివారం చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదమయ్యాయి. "దేశ వ్యతిరేక పాఠాలు" ప్రచారం చేస్తున్నారనే కారణంతో రాష్ట్రంలోని మదర్సాలను నిషేధించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి రేణుకాచార్య పిలుపునివ్వ‌డం వివాదాస్పదమైంది. రేణుకాచార్య మాట్లాడుతూ.. మదర్సాలను నిషేధించాలని నేను సీఎం, విద్యా మంత్రిని అభ్యర్థిస్తున్నాను. హిందూ, క్రిస్టియన్ విద్యార్థులు చదివే ఇతర పాఠశాలలు మనకు లేవా? మీరు ఇక్కడ దేశ వ్యతిరేక పాఠాలు నేర్పుతున్నారు. వాటిని నిషేధించాలి లేదా ఇతర పాఠశాలల్లో బోధించే సిలబస్‌ను బోధించేలా చేయాలని రేణుకాచార్య వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న రేణుకాచార్య.. హిజాబ్ రో విష‌య‌మై కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సమస్యను కల్పించి.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మదర్సాల అవసరమేంటని ప్రశ్నించారు. హిజాబ్ సమస్యను సృష్టించిన కాంగ్రెస్‌ను నేను అడగాలనుకుంటున్నాను.. మీకు ఓటు బ్యాంకు ముఖ్యమా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. నేను కాంగ్రెస్‌ను అడుగుతున్నాను, మనకు మదర్సాలు ఎందుకు అవసరం? మదర్సాలు ఏమి ప్రచారం చేస్తాయి? అమాయక పిల్లలను రెచ్చగొడుతున్నారు. రేపు, వారు మన దేశానికి వ్యతిరేకంగా వెళతారు. 'భారత్ మాతా కీ జై' అని ఎన్నటికీ చెప్పరని రేణుకాచార్య సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడాన్ని ఆయన విమర్శించారు.. బంద్‌ "దేశ వ్యతిరేకం" అని.. పిలుపునిచ్చిన‌ సంస్థలను నిందించారు. ''కొన్ని దేశ వ్యతిరేక సంస్థలు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. దీన్ని ప్రభుత్వం సహించగలదా? ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇస్లామిక్ దేశమా? దీన్ని సహించను. దీనిని కాంగ్రెస్ నేతలు సభలోనే సమర్థించారని మండిప‌డ్డారు.













Next Story