తమ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామంటూ భారత్ చేస్తున్న వ్యాఖ్యలను పక్క దేశం పాకిస్తాన్ ఖండించింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగి నిరాధారమైనవి ఆరోపణలు చేసింది. బాలాకోట్‌లోని టెర్రరిస్టుల క్యాంపులపై ఎయిర్‌స్ట్రైక్స్ జరిగిన తర్వాత పాకిస్తాన్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని ఫిబ్రవరి 27, 2019న కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ కూల్చి వేశారు. ఆ తర్వాత అతడు నడుపుతున్న మిగ్-21 యుద్ధ విమానం పాకిస్తాన్‌లో నేల కూలింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ అభినందన్‌ను బంధించి చిత్ర హింసలకు గురి చేసింది.
2019 మార్చి 1వ తేదీ రాత్రి అతడిని పాక్ విడుదల చేసింది. కాగా తాజాగా అభినందన్ చేసిన ధైర్య సాహసాలకు కేంద్ర ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారంతో సత్కరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశం స్పందించింది. తమ విమానాన్ని అభినందన్ కూల్చలేదని పాక్ విదేశాంగ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 2019 ఫిబ్రవరి తమ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చివేశాడని భారత్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొంది. 2019 ఫిబ్రవరి 27న ఎలాంటి విమానం కూలలేదని అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికే చెప్పారని పేర్కొంది.
పూర్తిగా బట్టబయలు చేయబడిన అబద్ధాన్ని ప్రచారం చేయాలని భారతదేశం పట్టుబట్టడం హాస్యాస్పదమైనదని అంటూ మాట్లాడింది. భారత పైలట్ అభినందన్ దుందుడుకు చర్యలకు పాల్పడాలని చూశాడని.. అయిన ఆరోజు అతడిని విడుదల చేయడం తమది శాంతి కాముక దేశానికి నిదర్శనం అని పాకిస్తాన్ పేర్కొంది. శౌర్యం యొక్క ఊహాత్మక విన్యాసాలకు సైనిక గౌరవాలు మంజూరు చేయడం సైనిక ప్రవర్తన యొక్క ప్రతి నియమానికి విరుద్ధం. అటువంటి అవార్డును ఇవ్వడం ద్వారా తరువాత ఆలోచనగా భారతదేశం తనను తాను అపహాస్యం చేసుకుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.