లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) కేసును పరిష్కరించేందుకు సగటున 509 రోజులు పడుతోందని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. పిల్లలకు సంబంధించిన కేసుల పరిష్కారాలను వేగవంతం చేయడానికి మౌలిక సదుపాయాల పరంగా ఏమి చేయాలనే దానిపై న్యాయమూర్తుల నుండి సలహాలను కోరారు. పోక్సో చట్టం 2012 లైంగిక వేధింపులు, లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాల నేరాల నుండి పిల్లలను రక్షించడం, అలాంటి నేరాల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించారు.
లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడంపై శనివారం జరిగిన నేషనల్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ ప్రారంభ సెషన్‌లో ఇరానీ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం పోక్సో కేసుల్లో 56 శాతం లైంగిక వేధింపుల నేరాలకు సంబంధించినవేనని అన్నారు. పోక్సో కేసు పరిష్కారానికి సగటున 509 రోజులు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కేసుల్లో విచారణ వేగవంతం అయ్యేందుకు మన దేశంలోని న్యాయ వ్యవస్థతో మంత్రిత్వ శాఖ భాగస్వామిగా ఉండనుందని.. అందుకోసం మంత్రిత్వ శాఖ ద్వారా ఇంకా ఏమి చేయవచ్చో చెప్పాలని.. మౌలిక సదుపాయాల పరంగా పలు అంశాలు మెరుగుపడాలని ఆమె అన్నారు.