అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులు.. అధికారిక గణాంకాలను విడుదల చేసిన ప్ర‌భుత్వం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల అధికారిక జాబితా బయటకు వచ్చింది.

By Medi Samrat
Published on : 24 Jun 2025 3:51 PM

అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులు.. అధికారిక గణాంకాలను విడుదల చేసిన ప్ర‌భుత్వం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల అధికారిక జాబితా బయటకు వచ్చింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది మరణించినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో మరో 34 మంది చనిపోయారు. మొత్తం 275 మంది మరణించారు. తాజా సమాచారం ప్రకారం.. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా 259 మంది చనిపోయినట్లు గుర్తించారు. అదే సమయంలో 256 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ముగ్గురు బ్రిటన్ పౌరుల మృతదేహాలను విమానంలో పంపించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ గుర్తించిన‌ 259 మృత‌దేహాల‌లో 199 మంది భారతీయులు, ఏడుగురు పోర్చుగీస్, 52 మంది బ్రిటిష్, ఒక కెనడియన్ జాతీయులు ఉన్నారు. చనిపోయిన 259 మందిలో ఆరుగురిని ముఖం ద్వారా గుర్తించారు. మిగిలిన వారి గుర్తింపు DNA పరీక్ష ద్వారా నిర్ధారించబడింది.

Next Story