వందేమాతరం తప్పనిసరి చేయడమా..? ముస్లిం సంఘాల ఆందోళన

వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

By -  Medi Samrat
Published on : 13 Feb 2026 9:10 PM IST

వందేమాతరం తప్పనిసరి చేయడమా..? ముస్లిం సంఘాల ఆందోళన

వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జమీయత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ... వందేమాతరం పాటను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ ఉపాధ్యక్షుడు మౌలానా కౌసర్ హయాత్ ఖాన్ కూడా దీన్ని తప్పుబట్టారు. మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్న అంశాల కారణంగా కొందరు ముస్లింలు వందేమాతరం పాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందే ఈ అంశంపై అభ్యంతరాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా అమలు చేయడం దేశానికి కూడా మంచిది కాదన్నారు.

అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు ‘వందే మాతరం’ గేయం పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం ప్లే అవుతున్నప్పుడు నిలబడటం తప్పనిసరి చేసింది. సినిమా హాళ్లలాంటి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిలబడటం తప్పనిసరి కాదని తెలిపింది. అన్ని పాఠశాల్లో ఉదయం అసెంబ్లీ టైంలో తప్పనిసరిగా వందేమాతరం ఆలపించాలి. పూర్తి ఆరు చరణాలను 3 నిమిషాల 10 సెకన్లలో పాడాలి.

Next Story