మమతా బెనర్జీపై దాడి.. నందిగ్రామ్‌లో ఉద్రిక్తత!
Attack On CM Mamata Banerjee. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
By Medi Samrat Published on 10 March 2021 10:03 PM ISTపశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తృణముల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మద్య మాటల యుద్దం మాత్రమే కాదు.. భౌతిక దాడులు కూడా జరగుతున్నాయి. తాజాగా బుధవారం నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై దాడి జరిగింది. కారు ఎక్కబోతున్న ఆమెపై కొంతమంది దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు... కాలికి గాయమైంది. నందిగ్రామ్ లో ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారిపై ఆమె పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలో తన నామినేషన్ వేయడానికి ఆమె నందిగ్రామ్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెపై దాడి జరిగింది. దాంతో మమతా నందిగ్రామ్ పర్యటనను రద్దు చేసుకొని కోల్‌కతాకు వెళ్లారు. తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని మమతా తెలిపారు. దీంతో నందిగ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం కోల్ కతాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగ్రామ్ లోనే ఈ రాత్రికి ఆమె బస చేయాల్సి ఉంది.
తన పర్యటన సందర్భంగా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించలేదని మండిపడ్డారు. సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని అన్నారు. దాడిలో తన కాళ్లకు గాయాలయ్యాయని చెప్పారు. దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ దాడిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మమత చెప్పారు. అయితే దాడి నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకున్న ఆమె కోల్ కతాకు తిరుగుపయనం అయ్యారు.