ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..

సెప్టెంబర్ 21న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

By Medi Samrat  Published on  18 Sep 2024 12:02 PM GMT
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..

సెప్టెంబర్ 21న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. PTI నుండి అందిన సమాచారం ప్రకారం.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా ప్రమాణ స్వీకారం గురించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసారు. ప్రమాణ స్వీకారం సెప్టెంబర్ 21వ తేదీగా చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం VK సక్సేనాకు తన రాజీనామాను సమర్పించారు. అతిషి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న‌ట్లు స‌మాచారం ఇచ్చారు. అయితే ప్రమాణ స్వీకార తేదీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి తేదీని ప్రకటించలేదు.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రకటనతో ప్రభుత్వ కొత్త కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ జోరందుకుంది. కొత్త కేబినెట్‌లో పాత ముఖాలందరికీ అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులపై ప్రాంతీయ, కుల సమీకరణాలను పరిష్కరించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది. షెడ్యూల్డ్ కులాల సభ్యుడికి కేబినెట్‌లో చోటు ద‌క్కుతుంద‌ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఎస్టీ కోటా నుంచి మంత్రి పదవి కోసం కులదీప్ కుమార్, విశేష్ రవి, గిరీష్ సోనీలు రేసులో ఉన్నారు. అయితే.. ప్రస్తుత మంత్రివర్గాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా లేరని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత మంత్రులకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఢిల్లీ కేబినెట్‌కు సంబంధించి గురువారం నాటికి నిర్ణయం తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది. అదే సమయంలో రాష్ట్రపతి నుంచి గ్రీన్ సిగ్నల్ వ‌స్తే శుక్రవారం నాటికి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈసారి లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌లోనే ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని భావిస్తున్నారు.

Next Story